మోదీ సర్కారువన్నీ డబ్బా కబుర్లే….
ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమంటూ బాకా కొట్టుకోవడానికి ముందు వరుసగా పదేళ్లపాటు అత్యంత పటిష్టమైన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిని సాధించి చూపాలని. ఆర్థిక వృద్ధి రేటుపై మోదీ సర్కారువన్నీ డబ్బా కబుర్లేనంటూ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పరోక్షంగా చురకలంటించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి రేటు ఘోరంగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఏకంగా మూడేళ్ల కనిష్టానికి(5.7 శాతం) పడిపోయింది. అంతక్రితం త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదైంది. అయితే, ఇదే తరుణంలో చైనా మాత్రం 6.5 శాతం చొప్పున వృద్ధి సాధించి భారత్‌ను వెనక్కినెట్టింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘భారత్ తన సంస్కృతి, చరిత్ర గురించి ప్రపంచానికి ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు. అయితే, ఆర్థిక వృద్ధి విషయంలో మాత్రం ఈ బాకా కుదరదు. అని రాజన్ చెప్పారు.








