విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్
భారత్ నుంచి ఐరోపా, కెనడా, అమెరికాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఖతార్ ఎయిర్వేస్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అమెరికా ప్రయాణానికి 23 కిలోల చొప్పున మూడు బ్యాగ్‌లను, ఐరోపా ప్రయాణానికి 40 కిలోల చొప్పున మూడింటిని అనుమతిస్తారు. 2018 మార్చి 31 లోపు చేసుకున్న టికెట్ల బుకింగ్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. 2018 డిసెంబరు 31 వరకు ఈ టికెట్లపై ప్రయాణించవచ్చు. విద్యార్థులు తమ ప్రయాణ తేదీని సైతం ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఒక్కసారి మార్చుకోవచ్చు. 20 శాతం రాయితీపై అదనపు బ్యాగేజీ తీసుకెళ్లొవచ్చని, కొంత మొత్తం చెల్లించి బిజినెస్ క్లాస్‌కు మారొచ్చని ఖతార్ ఎయిర్వేస్ వెల్లడించింది.













