ప్రధాని మోడీని కలిసిన బాలీవుడ్ భామ
భారత ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బెర్లిన్లో ఉన్న మోడీని బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా కలిసింది. తన హాలీవుడ్ సినిమా బేవాచ్ ప్రమోషన్ కోసం ప్రియాంక కూడా బెర్లిన్లోనే ఉంది. దీంతో, ప్రధానిని ఆమె మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా ప్రధానితో కలిసిగి దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె అప్లోడ్ చేసింది. నరేంద్ర మోడీ సార్ ఉదయం నా కోసం కొంచెం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.








