ఏపీకి శుభం జరగాలి… ప్రధాని మోడీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు శభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను చైతన్య వంతులుగా అభివర్ణిస్తూ శుభం జరగాలని పేర్కొన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నూతన శిఖరాలను ఎదుగుతూ దేశ వృద్ధికి తోడ్పాటును కొనసాగించాలి అని ప్రధాని కాంక్షించారు. కాగా, తెలంగాణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతూ తెలంగాణ ప్రగతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నా అని తెలిపారు.








