జూలై 17న ప్రథమ పౌరుడి ఎన్నిక
భారత 15వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెరతీసింది. జులై 17వ తేదీన ఎన్నిక నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం ఖైదీ, కమిషనర్లు ఏకే జోతి, ఏపీ రావత్‌లు ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసేంతవరకూ దేశంలో ఖాలీగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు ఎన్నికలు నిర్వహించబోమని సృష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులై 24వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 ప్రకారం కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల చేసింది.








