సెప్టెంబర్ 1న తిరుమలకు రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుమలకు రానున్నారు. సెప్టెంబర్ 1న తిరుమల శ్రీవారిని కోవింద్ దర్శించుకోనున్నారు. 2వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు రామ్నాథ్ కోవింద్. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలకు రావడం ఇదే తొలిసారి.








