జాస్తి రమేష్‌కు స్టాండర్డ్ సిటిజన్ అవార్డు
సామాజిక సేవారంగంలో చేసిన సేవలకు గుంటూరు జిల్లాలోని కొప్పర్రు గ్రామానికి చెందిన జాస్తి రమేష్‌కు స్టాండర్డ్ సిటిజన్ అవార్డు లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రమేష్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎన్నారై సేవా ఫౌండేషన్ దేశంలో వివిధ రంగాల్లో సమాజ సేవ చేసి నలుగురికి పురస్కారాలను అందచేశారు. అందులో జాస్తి రమేష్ ఒకరు కావడం విశేషం. పురస్కాలు పొందినవారిలో హైదరాబాద్‌కు చెందిన శస్త్ర వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ రెడ్డితో పాటు గుంటూరు చెందిన జాస్తి రమేష్ రాష్ట్రపతి నుంచి పురస్కారం స్వీకరించారు. కొప్పర్రు గ్రామానికి చెందిన రమేష్ పొగాకుబోర్డు, టెలికం, రైల్వేస్, ఎఫ్సీఐలలో సభ్యుడిగా వ్యవహరించారు.








