మళ్లీ నేనే ఉండను!
రాష్ట్రపతి పదవి మళ్లీ తనకే దక్కుతుందంటూ జరుగుతున్న ఊహాగానాలకు ప్రణబ్ ముఖర్జీ తెరదించారు. కచ్చితంగా నేను రెండు నెలలో ఈ పదవిలో ఉంటాను. జులై 25న కొత్త రాష్ట్రపతి వస్తారని అని రామ్నాథ్ గోయంకా లెక్చర్ కార్యక్రమంలో సృష్టం చేశారు. ఈ సందర్భంగా వర్తమాన భారతానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. దేశంలో అసహన ధోరణులకు తావే లేదని ఉద్ఘాటించారు. సహనం, సంయమనం, వాదన సమిష్టిగా నిగ్గుదేలాలన్నారు. దేశం ఉజ్వలంగా ముందుకుసాగాలా లేక సంకుచిత ధోరణులే కావాలో భారతీయులే తేల్చుకోవాలన్నారు. భారత్లో భిన్నవాదనలకు ఆస్కారం ఉంది కానీ సహన రాహిత్యానికి లేదని తెలిపారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న నిస్సహన ధోరణులు, మత ఘర్షణలను ప్రణబ్ పరోక్షంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం ఉజ్వలంగా పరిఢవిల్లాలంటే చర్చ, భిన్నాభిప్రాయాలే కీలకమన్నారు. భారత నాగరిక పునాదులు భిన్నత్వంలోనూ, సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన వైవిధ్యంలోనే ఉన్నాయన్నారు.








