కంచి కామాక్షి సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమిళనాడులోని కాంచీపురంలో పర్యటించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం కాంచీపురం వెళ్లిన రాష్ట్రపతి, కాంచీపురంలో కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కంచిమఠానికి వెళ్లి కంచి కామకోటీ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వామిజి విజయేంద్ర సరస్వతిలను కలిశారు. మే 24వ తేదీన రాష్ట్రపతి కంచి, చెన్నైలో పర్యటించాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.








