కేదారనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్రపతి
కేదారనాధ్, బదరీనాద్ ఆలయాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దేశ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్ వెళ్లిన రాష్ట్రపతి కేదారనాథ్ ఆలయాన్ని సందర్శించారు. మహాశివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు.








