సైనా, సింధుకు రాష్ట్రపతి అభినందనలు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి రెండు పతకాలు సాధించిన భారత క్రీడాకారిణులు పివి సింధు, సైనా నెహ్వాల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందించారు. వీరి విజయాలకు దేశం గర్విస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీరి విజయాలను అభినందిస్తూ ట్వీట్ చేశారు. సింధు ఆటను చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన సింధు, కాంస్యం సాధించిన సైనాకు ప్రోత్సాహకరంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నగదు బహుమతులను ప్రకటించింది. సింధుకు రూ.10 లక్షలు, సైనా నెహ్వాల్‌కు రూ.5 లక్షలు అందజేస్తామని బాయ్ అధ్యక్షుడు హిమాంత బి శర్మ తెలిపారు.








