ముగిసిన ప్రణబ్ ప్రస్థానం
పశ్చిమబెంగాల్లోని ఓ చిన్న గ్రామంలో విద్యాభ్యాసం చేసి, అంచెలంచెలుగా ఎదిగి, రాజకీయ ప్రస్థానంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అధిష్టించిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పదవీ విరమణ చేశారు. చివరగా ఇచ్చిన సందేశంలో పార్లమెంట్ తనకు దేవాలయం వంటిదని, ఎప్పటికీ దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. దేశానికి తాను చేసిన దానికంటే తనకు దేశమే ఎక్కువ ఇచ్చిందని చెప్పారు. తనపై నమ్మకం?ఉంచిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. విశ్వవిద్యాలయాలు, శాస్త్ర సాంకేతిక విద్యాసంస్థల ప్రగతిపై చర్చ జరగాలన్నారు. పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా కొత్త సేద్యాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.








