తెలగు రాష్ట్రాల మధ్య ముగిసిన విద్యుత్ బంధం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ బంధం పూర్తిగా తెగిపోయింది. విద్యుత్ వాటా కింద తెలంగాణకు సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను ఏపీ శనివారం నిలిపివేసింది. అలాగే ఆదివారం తెల్లవారుజాము నుంచి తెలంగాణ సైతం ఏపీ వాటా సరఫరాను నిలుపుదల చేసింది. రూ.3,139కోట్లు తెలంగాణ ఏపీకి బకాయి అని, రూ.1,676.46 కోట్లు ఏపీ తెలంగాణకి బకాయి అని పేర్కొంటుంది.








