మన్మోహన్కు ప్రధాని మోడీ బర్త్డే విషెస్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు మన్మోహన్ 85వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మోడీ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా అని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోడీతో పాటు పలువురు బిజేపీ నేతలు, కాంగ్రెస్ నాయకులు మన్మోహన్కు బర్త్డే విషెస్ తెలిపారు. 2004-2014 మధ్య మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 1932లో ఆయన పంజాబ్లో జన్మించారు. 1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.













