హెచ్1బి వీసాల గురించి ట్రంప్‌తో మోదీ చర్చించారు
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన భేటీలో హెచ్1బి వీసా స్ఫూర్తి గురించి చర్చించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారతీయ నిపుణులు చేసిన కీలక కృషి గురించి ట్రంప్ అంగీకరించేలా చేశారు. హెచ్1బి వీసాలపై అమెరికా విధించిన నియంత్రణల గురించి రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ విదేవీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిపుణుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఆ ప్రభావం అమెరికాపై పడుతుందని ట్రంప్ అంగీకరించారన్నారు.













