ప్రధాని మోడీ అమెరికా పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ జూన్-జులై నెలల్లో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. తమ దేశానికి రావాల్సిందిగా గత నెలలో ఢిల్లీ వచ్చిన అమెరికా జాతీయ భద్రత సలహాదారు మెక్‌మాస్టర్ ప్రధానిని ఆహ్వానించారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లు జరిపే ద్వైపాక్షిక చర్చలకు అనుకూలమైన తేదీలను నిర్ణయించడంపై రెండు దేశాల అధికారులు కసరత్తు చేసున్నారు. మూడు తేదీలు ఇప్పటికే పరిశీలనలోకి వచ్చాయి. ఈ లోగా జర్మనీ లోని హాంబర్గ్‌లో జులై 7,8 తేదీల్లో జరిగే జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది.








