వాషింగ్టన్ లో భారతీయులను కలవనున్న ప్రధాని మోడీ
ఈ నెల చివర్లో అమెరికా వెళ్లనున్న ప్రధాని మోడీ అక్కడ భారత సంతతీయులను కలవనున్నారు. వాషింగ్టన్ డీసీలో ఆయన భారతీయులను కలుసుకుంటారని విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ నెల 24న పోర్చుల్ వెళ్లనున్నట్లు తెలిపారు. 27న ఆయన నెదర్లాండ్స్ వెళ్తారు అని అన్నారు. అక్కడ మోదీ నెదర్లాండ్స్ కింగ్తో భేటీ అవుతారని తెలిపారు.








