ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
తమ దేశంలో జూలై 4 నుంచి మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ జరపనున్న పర్యటనకు ఇజ్రాయెల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విమానాశ్రయంలో ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి బృందం స్వాగతం పలకనుంది. ప్రొటోకాల్‌లో ఈ అరుదైన గౌరవాన్ని పోప్‌నకు, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఇజ్రాయెల్ ఇస్తుంటుంది. ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. మోదీ గౌరవార్థం జులై 4న తమ ప్రధాని విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.








