9వ బ్రిక్స్ సదస్సుకు మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు చైనాలోని జియామెన్ సిటీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు మోదీ హాజరవుతారని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఆ దేశంలో జరగనున్న 9వ బ్రిక్స్ సదస్సుకు మోదీ హాజరవుతారని పేర్కొంది.








