చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ తో మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్తో భేటీ అయ్యారు. రెండు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై పరస్పరం బాధ్యతాయుతంగా వ్యవహరిద్దామని మోదీ ఈ సందర్భంగా జింగ్పింగ్కు సూచించారు. రెండు దేశాల నడుమ వివిధ అంశాలపై ఉన్న భేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదని, పరస్పరం అవగాహనతో వాటిని పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యమిద్దామని మోదీ సూచించారు. ఎస్సీవోలో భారత సభ్యత్వానికి మద్దతు పలికినందుకు జింగ్పింగ్కు కృతజ్ఞతలు తెలిపారు.








