ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ అరుదైన కానుకలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెతన్యాహుకు ప్రధాని మోదీ అరుదైన కానులు అందజేశారు. భారత్‌లో ఆనాటి యూదుల చరిత్రకు సంబంధించిన కళాఖండాలను మోదీ బహుమతిగా ఇచ్చారు. మొదటిది కేరళోని కొచ్చిన్‌లో యూదుల చరిత్రను తెలిపే రాగిపలకల ప్రతిరూపం. రెండోది భారతలోని యూదుల వ్యాపారాలను తెలిపే డాక్యుమెంట్‌తో కూడిన రాగిపలకల ప్రతిరూపం. వీటితో పాటు కేరళలోని పరదేశీ యూదుల సంఘం విరాళంగా ఇచ్చిన తోరా, బంగారంతో పూత పూసిన కిరీటాన్ని మోదీ నెతన్యాహుకు కానుగా ఇచ్చారు. వీటిని చూసి ఇజ్రాయెల్ ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.








