దీపావళి ముందే వచ్చింది : మోదీ
పదిహేను రోజులు ముందుగానే దీపావళి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ద్వారాకలోని ఓకా-బెట్ వంతెనుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ జీఎస్టీ కింద 27 వస్తువులపై పన్ను తగిస్తూ, జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని స్వాగతించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజలకు 15 రోజుల ముందుగానే దీపావళి వచ్చిందన్నారు. మూడు నెలల పాటు జీఎస్టీ గురించి పూర్తి అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. జీఎస్టీ మండలిలో ఏర్పడ్డ ఏకాభిప్రాయం మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. గుజరాత్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని విమర్శలు చేశారు. ప్రపంచం వేగంగా మారుతోందని, దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతి భారతీయుడు కలలు కంటున్నాడన్నారు.








