పోస్ట్ కార్డ్ ని లిఫాఫాగా పేరు మార్చిన పేటీఎం
ప్రత్యేకమైన సందర్భాల్లో కస్టమర్లు నగదురహిత సదుపాయాల్ని ఉపయోగించటానికి ఈ రాఖీకి, సాఫ్ట్ బ్యాంకు మద్దతుగల పేటీఎం షగున్ డిజిటల్ వెర్షన్ ని ప్రారంభించింది. ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తూ దేశవ్యాప్తంగా కస్టమర్లు ఒకరితో మరొకరు నగదు వెంటనే ఇచ్చిపుచ్చుకోవచ్చు.
ప్రారంభించిన 24 గంటల లోగానే, తన రాఖీ ఇతివృత్తం కోసం పేటీఎం లావాదేవీల్లో అనూహ్యమైన పెరుగుదల కనిపించింది. మూడు వారాలలో అర్థ మిలియన్ లావాదేవీలతో ఈ సేవ విస్త్రతంగా ప్రజాదరణ పొందింది. థాంక్యూ, లక్కీ యు మరియు బెస్ట్ విషెస్ వంటి వివిధ ఇతర ఇతివృత్తాల్ని కూడా ఉపయోగిస్తూ యూజర్లు నగదు పంపించే సేవలు కూడా ప్రసిద్ధి చెందాయి. మరింతగా సామాన్య ప్రజల్ని ఆకట్టుకోవటానికి కంపెనీ ఇప్పుడు తన బహుమానాల పరిష్కారాన్ని పేటీఎం లిఫాఫాగా బ్రాండింగ్ ఇస్తోంది.
పేటీఎం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ దీపక్ అబ్బోట్ ఇలా అన్నారు, ” పేటీఎం లిఫాఫా ఆఫర్ చాలా తక్కువ సమయంలోనే ఎన్నో లావాదేవీల్ని చేసింది. సాంఘిక సందర్భాల్లో తరాల కొద్దీ మరియు ఒక బలమైన భావోద్వేగానికి చిహ్నంగా నిలిచిన స్థానిక పదమైన ‘లిఫాఫా’ అని మేము దీనికి పేరు ఇస్తున్నాం. డబ్బుని వెంటనే చెల్లించటానికి మా చెల్లింపుల ఆఫర్ ని మరింత కొత్త ప్రామాణాలుగా తీర్చిదిద్దటంలో ఇది సహాయపడుతుంది. “
డిజిటల్ చెల్లింపులకి అనుకూలంగా వినియోగదారుల ప్రవర్తనలో ఒక విస్త్రతమైన మరియు శాశ్వతమైన మార్పుకి మద్దతు ఇవ్వటానికి పేటీఎం కట్టుబడింది. తన చెల్లింపుల వేదికపై డిజిటల్ చెల్లింపుల సౌకర్యం యొక్క శక్తిని మరింతమంది వినియోగదారులు అనుభవించేలా చేయటానికి కంపెనీ నగదుని స్థానభర్తీ చేయటానికి ప్రయత్నిస్తోంది.








