పేటీఎం మాల్ యొక్క ‘మేరా క్యాష్ బ్యాక్ సేల్’ అత్యంత గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటు వస్తున్నాయి
నాలుగు రోజుల సేల్ సమయంలో కస్టమర్లు క్రాఫ్ నుంచి రూ. 501 గ్యారంటీ క్యాష్ బ్యాక్ అందుకుంటారు.
తన మొదటి పండగ మాసంలో సెప్టెంబర్ 20 నుంచి 23 వరకు పేటీఎం ఈకామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన పేటీఎం మాల్ నాలుగు రోజుల మేరా క్యాష్ బ్యాక్ సేల్ ని ప్రకటించింది. సాటిలేని ధరలకు విస్తృత శ్రేణికి చెందిన ఉత్పత్తుల్ని విక్రయించే చిన్న దుకాణుదారులు, పెద్ద రీటైల్ చెయిన్స్ , బ్రాండ్ అధికారిక స్టోర్స్ తో కంపెనీ ఉమ్మడిగా పని చేస్తుండటం వల్ల కస్టమర్లు రూ. 501 గ్యారంటీ క్యాష్ బ్యాక్ క్రాఫ్ నుంచి పొందుతారు. సేల్ లో బహుమతి వస్తువులు, మొబైల్స్, ఉపకరణాలు, చెప్పులు, దుస్తులు, యాక్ససరీస్ వంటి ఫ్యాషన్ కి చెందిన ఇతర వస్తువులు 15 % నుంచి 100 % కి క్యాష్ బ్యాక్ లో లభిస్తాయి. అదనంగా, ఈ వేదిక ప్రతీరోజు 100 % క్యాష్ బ్యాక్ ని 25 మంది ఫోన్ బయ్యర్లకు అందిస్తుంది. 200 మంది కస్టమర్లు ప్రతీరోజూ 100 గ్రా పేటీఎం బంగారాన్ని అందుకుంటారు. ఇది చెల్లించిన సొమ్ముకు తగిన విలువైన సేల్ గా చేసింది.
సేల్ ఆర్డర్లు దగ్గరలోని బ్రాండ్ అథీకృత స్టోర్, పెద్ద రీటైల్ చెయిన్ లేదా చిన్న దుకాణుదారుచే అందుకోబడతాయి కాబట్టి కంపెనీ తన ఆన్ లైన్ టు- ఆఫ్ లైన్ (020) మోడల్ పై పెద్ద ఎత్తున ఆధారపడింది. ఇరవై నాలుగు గంటల వ్యాపారాన్ని అందుకుని మరియు దేశపు ఆన్ లైన్ రీటైల్ విప్లవంలో చేరుతారు కాబట్టి పేటీఎం మాల్ తో భాగస్వామం చెందిన రీటైలర్లకు ఇది ఈ పండగల మాసంలో సేల్స్ పెరిగేలా చేస్తుంది. అన్ని పండగ ఆర్డర్లకు ఇది అతి తక్కువ సమయంలోనే డెలివరీ జరిగేలా హామీవహిస్తుంది మరియు వేర్ హౌసింగ్ వంటి ఇతర అదనపు ఖర్చుల్ని ఆదా చేస్తుంది. నాలుగు రోజుల సేల్ లో 80 %కి పైగా రీటైలర్స్ పాల్గొంటున్నారు మరియు నాలుగు రోజుల సమయంలో 5 మిలియన్ కి పైగా కొత్త యూజర్లు విక్రయించనున్నారని ఆశించిన నేపధ్యంలో తమ మొత్తం పండగ సేల్స్ లో వేదిక 10-15 % వరకు అందచేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. అతి తక్కువ ధరలకు విస్తృతమైన బ్రాండెడ్ వస్తువుల్ని చిన్న పట్టణాలకు చెందిన కస్టమర్లు కొనుగోలు చేసే అవకాశాన్ని కలిగించటంలో ఈ సేల్ పెద్ద పాత్ర పోషిస్తోంది.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో నమ్మకమైన షాపింగ్ అనుభవాన్ని కలిగించే తన లక్ష్యంలో భాగంగా, పేటీఎం మాల్ కి వేలాది దుకాణాలు ఉన్నాయి. వాటికి పేటీఎం మాల్ క్యూఆర్ సదుపాయాన్ని కలిగించింది. కస్టమర్లు ఈ క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేసి ఇటువంటి ఆఫర్లని పొందవచ్చు. పేటీఎం మాల్ వేదికపై పండగల మాసపు ఉత్తమమైన ఆఫర్లని గుర్తించటానికి ఆఫ్ లైన్ లో కొనుగోలు చేయటానికి ప్రాధాన్యతనిచ్చే కస్టమర్లకు ఈ చర్య సహాయపడుతుంది.
పేటీఎం మాల్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా మాట్లాడుతూ, ‘ పేటీఎం మాల్ లో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా , మేము మా భాగస్వామ బ్రాండ్లు, వ్యాపారుల సహకారంతో అతి పెద్ద వివిధ రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాం. మొబైళ్లు, ఉపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తుల్ని కస్టమర్లు సాటిలేని ధరలకు పొందుతారు. తమకు దగ్గరలోని బ్రాండ్ అథీకృత స్టోర్స్ లేదా దుకాణుదారుల నుంచి నమ్మకమైన ఉత్పత్తిని పొందుతారు. ప్రతీరోజూ ఫోన్లు, పేటీఎం బంగారాన్ని ఇచ్చి మేము ఈ ఉత్సాహాన్ని ఇదే విధంగా ఉంచుతాం. మా కస్టమర్లు మరియు భాగస్వాములకు ఈ దీపావళి ని ఒక నిజమైన పండగ సందర్భంగా ఉంచాలని కోరుకుంటున్నాం.
యాపిల్, శామ్ సంగ్, ఎల్జీ, అప్పో, వివో, సోనీ, హెచ్ పీ, లెనోవో, జేబీఎల్, ఫిలిప్స్, ప్యూమా, అల్లెన్ సోల్లి, లీ, పెపి, లీవైస్, వీరో మోడా, వ్యాన్ హ్యుసేన్, యాక్షన్, ఉడ్ ల్యాండ్, క్యాట్ వాక్, స్కెచర్స్, రేడ్ టేప్, క్రాక్స్, టైమెక్స్ , సఫారి, లావీ, కప్రీస్, బగ్గిట్ వంటి పలు ప్రముఖ బ్రాండ్లు మేరా క్యాష్ బ్యాక్ సేల్ లో పాల్గొంటున్నారు. స్మార్ట్ ఫోన్స్ పై ఈ వేదిక రూ. 15,000, ల్యాప్ టాప్స్ పై రూ. 20,000, పెద్ద ఉపకరణాలైన ఎల్ఈడీ టీవీ, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషిన్లపై 20 % క్యాష్ బ్యాక్ ;
టీవీలపై రూ. 20,000 క్యాష్ బ్యాక్ , దుస్తులపై 70 % , బ్యూటీ , పర్శనల్ గ్రూమింగ్ ఉత్పత్తులపై 50% , షూలపై 60% , లగ్జరి వాచీలపై రూ. 20,000, కిచెన్ అప్లైయెన్సెస్ పై రూ. 60% , ట్రిమ్మర్స్, షేవర్స్ మరియు ఇతర వ్యక్తిగత గ్రూమింగ్ ఉపకరణాలపై 50% వరకు క్యాష్ బ్యాక్ ని ఈ వేదిక అందిస్తోంది.













