ఈ పండుగ సీజన్లో రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్న పేటీఎం మాల్
అమోఘమైన షాపింగ్ అనుభవం కోసం స్థానిక దుకాణుదారుల్ని శక్తివంతం చేస్తుంది.
పేటీఎం మాల్ పేటీఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది. ఇటీవల పేటీఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఏడాది పండగల సీజన్ సందర్భంగా భారతదేశపు అతి పెద్ద ఆన్ లైన్ మాల్ ని తన యాప్ పై ప్రారంభించింది. 1000కి పైగా బ్రాండ్ స్టోర్స్ నుంచి మరియు 65 మిలియన్ లకి పైగా ఉత్పత్తుల్ని విక్రయించే 15000 బ్రాండ్ అథీకృత రీటైలర్ల నుంచి కస్టమర్లు వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం కలిగిస్తోంది. నమ్మకమైన దుకాణుదారులు మరియు బ్రాండ్ అథీకృత స్టోర్స్ కోసం కంపెనీ ఒక సాంకేతిక భాగస్వామిగా తలెత్తింది. ఆన్ లైన్ లో తమ స్టోర్స్ ఏర్పర్చుకోవటానికి, అదనపు సేల్స్ ఉత్పన్నం చేసుకోవటానికి మొబైల్ శక్తిని వినియోగించుకునేలా చేసింది. ఉత్పత్తుల్ని బ్రౌజ్ చేసి, ఆర్డర్ ఇవ్వటానికి ఉపయోగించబడే క్యూఆర్ కోడ్స్ ని కూడా ఇది దుకాణాల ముందు ఏర్పాటు చేస్తూ సాఫీగా గుర్తించటానికి మరియు కొనుగోలు అనుభవం కలిగించటానికి ప్రయత్నిస్తోంది.
ఆరంభమైన నాటి నుంచి ఇది కంపెనీ యొక్క మొదటి పండగ సజీన్ సేల్ కావటంతో వినియోగదారులకు నమ్మకమైన కొనుగోలు అనుభవం కలిగించటానికి మరియు వేగవంతంగా డెలివరీలు చేయటానికి దేశవ్యాప్తంగా బ్రాండ్ అథీకృత స్టోర్స్ మరియు దుకాణుదారుల్ని విస్తృతంగా సమీకృతం చేస్తోంది. దేశపు రీటైలర్ వర్గాలకి తమ వ్యాపారాలకు ప్రోత్సాహం ఇచ్చి, విస్తరింపు చేసుకునే అవకాశాన్ని పేటీఎం మాల్ కల్పిస్తోంది. ఈ సంవత్సరపు అతి పెద్ద రీటైల్ హంగామాని ప్రారంభించటానికి ప్రచారాలపై వ్యాపార భాగస్వాములతో ఇది ఉమ్మడిగా పని చేయనున్న నేపధ్యంలో కంపెనీ మార్కెటింగ్ , క్యాష్ బ్యాక్ మరియు ప్రచారాలలో రూ.1000 కోట్లు ఖర్చు చేయనుంది.
పేటీఎం మాల్ ప్రధాన ఆపరేటింగ్ అధికారి అమిత్ షా మాట్లాడుతూ,” ఈ సీజన్ ని గొప్పగా చేయటానికి ఈ పండగ సీజన్ లో సాంకేతిక శక్తిని స్థానిక దుకాణుదారుల చేతులకి ఇస్తాము. నమ్మకమైన రీటైలర్ల నుంచి ఉత్తమమైన మరియు అతి పెద్ద ఆఫర్లని కస్టమర్లకు అందించటం మరియు ఆన్ లైన్ షాపింగ్ లో మా వేదికే మొదటి ఎంపికగా చేస్తామని మేము వాగ్ధానం చేస్తున్నాం.”
ఈ సీజన్ లో ఫ్యాషన్ (ప్రధానంగా ఎథ్నిక్ దుస్తులు), బహుమతులు, మిఠాయిలు, ఎలక్ట్రోనిక్స్ మరియు ఉపకరణాలు, వినియోగదారులు ఉపయోగించే ఇతర వస్తువులు మరియు హోం ఫర్నిషింగ్స్ వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులు పేటీఎం మాల్ పై ఉత్తేజభరితమైన క్యాష్ బ్యాక్స్ మరియు ప్రోత్సాహాల్ని అందిస్తాయి. యాపిల్, శామ్ సంగ్, ఎల్జీ, అప్పో, హెచ్ పీ, సోనీ, లెనోవో, జేబీఎల్, ఫిలిప్స్, ప్యూమా, అలెన్ సోలీ, లీ, పెపీ, లెవీస్, వీరో మోడా, వ్యాన్ హ్యుస్సేన్, ఉడ్ ల్యాండ్, క్యాట్ వాక్, స్కెచర్స్, రెడ్ టేప్, క్రాక్స్ మరియు ఫాసిల్ మొదలైనటువంటి వినియోగదారులు అభిమానించే అథీకృత, ప్రత్యేక స్టోర్స్ ని కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. తమ జాబితాల్ని డిజిటలీకరణ చేయటం ద్వారా, మాల్ లో తమ స్టోర్ తెరవటం మరియు తమ దుకాణాలకి క్యూఆర్ కోడ్ సదుపాయం ఏర్పాటు చేయటం ద్వారా సాంకేతికత కలిగిన నమ్మకమైన దుకాణుదారులు మరియు బ్రాండ్ అథీకృత సెల్లర్స్ ని ఇది కలిగి ఉంది. ఇది విభిన్నమైన వినియోగదారులకు రీటైలర్లు సేవ చేయటానికి అవకాశం ఇస్తుంది.













