పేటిఎం మాల్ భారతదేశపు అతిపెద్ద మాల్ ను ఒక ఆప్ లో ఆవిష్కరిస్తోంది
– 1000 బ్రాండ్ స్టోర్స్ మరియు 15,000 బ్రాండ్–అధీక్రూత రీటైలర్స్ ద్వారా 65 మిలియన్ల కంటే ఎక్కువ ఉత్పత్తులు విక్రయించబడుచున్నాయి
పేటిఎం ఇకామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పేటిఎం మాల్, భారతదేశపు అతిపెద్ద ఆన్ లైన్ మాల్ ను ఈ సంవత్సరపు పండుగ వేళ ఆవిష్కరించింది. ఈ కంపెనీ తన కొత్త ఆప్ ను రిఫ్రెష్ చేస్తూ, ఇందులో 1,000 బ్రాండ్ స్టోర్స్ మరియు 15,000 బ్రాండ్-అధీకృత రీటైలర్స్ తో 65 మిలియన్లకంటే ఎక్కువ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇది బ్రాండ్-ఆధారిత ఆన్ లైన్ షాపింగ్ అనుభవంలో మొట్టమొదటిది, ఇందులో పేటిఎం వారు వినియోగదారులు ఈ బ్ర్రాండ్ స్టోర్స్ ను వారి పేటిఎం మాల్ ఆప్ లో బ్రౌజ్ చేసుకోవడానికి మరియు వారి సమీపంలోని బ్రాండ్-అధీకృత స్థానిక రీటైలర్ ద్వారా బట్వాడా పొందడానికి వీలు కల్పిస్తున్నారు.
పేటిఎం మాల్ అనేది బ్రాండ్స్ మరియు ఆఫ్ లైన్ రీటైలర్స్ యొక్క సాంకేతిక భాగస్వామిగా మారడాన్ని లక్ష్యంగా కలిగి ఉంది, ఇది వారికి ఆన్ లైన్ లో స్టోర్స్ ఏర్పాటుకు వీలుకల్పిస్తుంది. ఇది రీటైలర్స్ యొక్క సంపాదనా సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు నూతన ఉపాధి అవకాశాలకు దారితీస్తుంది, మరియు ఆన్ లైన్ షాపింగ్ కు సంబంధించిన విశ్వాసాన్ని మరియు సౌకర్యాన్ని నిలిపి ఉంచుతుంది. కంపెనీ స్థానిక షాప్ కీపర్స్ మరియు బ్రాండ్స్ తో భాగస్వామ్యం కలిగి ఉండి, ఆన్ లైన మోనోలితిక్ రీటైలర్స్ కు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ వేదిక లక్ష్యమేమిటంటే, ఈ రీటైల్ భాగస్వాముల జీవితాలలో కీలకమైన పాత్రను పోషించుట, మొబైల్ పవర్ మరియు అదనపు విక్రయాల ద్వారా వారి రీటైల్ సామర్థ్యాన్ని పెంపొందించడమే.
కంపెనీ తన వినియోగదారులు ప్రత్యేకమైన మరియు వారికి ఇష్టమైన బ్రాండ్స్ అంటే ఆపిల్, సాంసంగ్, ఎల్ జి, ఓప్పో, సోనీ, హెచ్ పి, లెనోవో, జెబిఎల్, ఫిలిప్స్, ప్యూమా, అల్లెన్ సోల్లీ, లీ, పేపె, లెవీస్, వెరో మోడా, వాన్ హ్యూసెన్, వుడ్ లాండ్, క్యాట్ వాక్, స్కెచెర్స్, రెడ్ టేప్, క్రాక్స్ మరియు ఫోస్సిల్ వంటి మరెన్నో బ్రాండ్స్ ను అన్వేషించడానికి వీలుకల్పిస్తుంది. వినియోగదారులు, వారి పిన్ కోడ్స్ కు ఉత్పత్తులను బట్వాడా చేయగల సమీపంలోని అధీకృతత స్టోర్స్ మరియు స్థానిక దుకాణందారుల వివరాలను చూడగలరు. పేటిఎం మాల్ ఆప్ అనేదానిలో ఒక కొత్త హోమ్ స్క్రీన్ కూడా ఉంటుంది, ఇది ఉత్పత్తులను నేవిగేట్ చేసి కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది. వినియోగదరులు మరియు వ్యాపారాలు వారి ఆర్డర్స్ చేయునప్పుడు జిఎస్ టిఐఎన్ నంబరును కూడా ఎంటర్ చేయవచ్చు మరియు వారి సంబంధిత ఇన్ వాయిసెస్ పై కావలసిన వివరాలను అందుకోవచ్చు, దీనితో వారు ట్యాక్స్ క్రెడిట్ ను తరువాత క్లెయిమ్ చేసుకోవచ్చు.
భారతీయ రీటైల్ మార్కెట్ అనేది అసమతలంగా విస్తరించబడింది, ఇందులో పెద్ద నగరాలలోని వినియోగదారులు పెద్ద బ్రాండ్స్ పొందగలుగుతున్నారు, మరియు చిన్న నగరాలలో ఉన్నవారికి విశ్వసనీయమైన బ్రాండ్ ఉత్పత్తులు పరిమితంగా లేదా అసలు లభ్యం కావడం లేదు. ఈ వినియోగదారులకు వారు కొనగల ఉత్తమ ఉత్పాదనల కొరకు స్టోర్స్ అందుబాటులో లేకపోవడంతో, బ్రాండెడ్ ఉత్పాదనల కొరకు డిమాండ్ పెరిగి, వాటిని నకిలీ మరియు కృత్రిమ ఉత్పత్తులను విక్రయించి ఒక కొరతలతో గల మార్కెట్ కు వీలుకల్పించబడుతోంది. దేశమంతటా విశ్వసనీయమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి, పేటిఎం మాల్ 19,000 పిన్ కోడ్స్ కు బ్రాండెడ్ ఉత్పత్తులకు బట్వాడా చేయగల హామీ ఇస్తోంది. వినియోగదారులు ఇప్పుడు ఉత్తమమైన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు మరియు ఇవి బ్రాండ్ ద్వారా నియంత్రించబడి, గుర్తించబడతాయి మరియు ఆఫ్ లైన్ బ్రాండ్ స్టోర్ షాపింగ్ అనుభవంలో లాగానే వారంటీ, సర్వీసింగ్, ఇన్స్టాల్లేషన్ మరియు ఇతర ఆవశ్యక సహకారం అందుకుంటాయి.
అమిత్ సిన్హా, సిఓఓ – పేటిఎంమాల్ ఇలా అన్నారు, “భారత వినియోగదారులు ఇప్పుడు అతిపెద్ద మాల్ నుండి ఉత్తమమైన ఉత్పత్తుల కొరకు షాపింగ్ చేయవచ్చు. వినియోగదారులు ఉత్తమమైన ఉత్పాదనలు కొనడానికి మరియు వారి పొరుగున ఉన్న బ్రాండ్ అధీక్రుత రీటైల్ నుండి బట్వాడా పొందడానికి, ఒక విశ్వసనీయమైన షాపింప్ వేదికను నిర్మించడమే మా లక్ష్యం. ఇకామర్స్ కోసం రెండు స్థూల వ్యాపార మాడల్స్ ఉన్నాయి: మొదటిది, ప్రతి ఒక్క రీటైలర్ కు సాంకేతిక భాగస్వామిగా మారడం మరియు రెండవది మీరే ఒక అతిపెద్ద రీటైలర్ గా మారడం. మాపద్ధతిలో మొదటి వ్యాపార మోడల్ కు తోడ్పాటు ఉంటుంది. ఒకే ఒక అతిపెద్ద ఆన్ లైన్ రీటైలర్ కంటే ఒక మిలియన్ రీటైలర్స్ తో పనిచేయడంలోనే మా అతిపెద్ద ఉద్దేశం నెరవేరుతుందని మేము విశ్వసిస్తాము. మేము మాతో కలిసి సాంకేతిక-సమగ్రతా వ్యాపారాలను నిర్మించడానికి చూస్తున్న దుకాణందారులను మరియు బ్రాండ్స్ ను ఆహ్వానిస్తున్నాము. మేము భారతదేశపు అతిపెద్ద విశ్వసనీయమైన రీటైల్ ఎకోసిస్టమ్ ను సృష్టించడమే లక్ష్యంగా కలిగి ఉన్నాము.”
పేటిఎం మాల్ అనేది తన మాల్ లో బ్రాండ్స్ స్టోర్స్ ను తెరవడాం ద్వారా సాంకేతికతతో బ్రాండ్-అధీకృత రీటైలర్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ స్టోర్స్ లో బ్రాండ్స్, దేసంలోని దాదాపు పతి నగరంలోనూ అందుబాటులో ఉండుటకు వీలుగా విస్తరించి, తమ ఇన్వెంటరీ, ప్రమోషన్స్ మరియు రిటర్న్ మరియు రీప్లేస్మెంట్ విధానాలను నియంత్రించడానికి వీలుంటుంది. ఇది మిలియన్ల కొద్దీ వినియోగదారులకు, ఆన్ లైన్ బ్రాండ్ స్టోర్స్ అందుబాటులో ఉండుటకు మరియాన్ లైన్ లో షాపింగ్ కొరకు అతిపెద్ద మరియు అతి సమగ్రమైన కేటలాగ్ అందుబాటులో ఉండుటకు సహాయపడింది.








