మీరు మా ప్రధాని అయితే పాకిస్థాన్ బాగుపడేది!
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తన సేవాగుణంతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆమె ఓ పాకిస్థానీ మహిళకు మెడికల్ వీసా మంజూరు విషయంలో సాయం చేశారు. దీనికి స్పందనగా సుష్మాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న తన బంధువుకి వెంటనే భారత్‌లో వైద్యం అందించాల్సి ఉందని, వీసా కోసం సాయం చేయాలని కోరుతూ పాకిస్థాన్‌కు చెందిన హిజాబ్ ఆసిఫ్ అనే మహిళ సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేసింది. దీంతో సత్వరమే స్పందించాలని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌కు మంత్రి సూచించారు. అక్కడి అధికారులు వెంటనే తమను సంప్రదించడంతో అక్కడి అధికారులు వెంటనే తమను సంప్రదించడంతో ఆసిఫ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. సుష్వాజీ ఏమని పిలవాలి మిమ్మల్ని, మీరంటే మాకు చాలా ప్రేమ, గౌరవం కూడా. మీరు మా ప్రధాని అయి ఉంటే పాకిస్థాన్ బాగుపడేది. అయినా పాక్‌కు మీవంటి మహిళను ప్రధానిగా పొందే అర్హత లేదు. మిమ్మల్ని దేవత అనాలో, సూపర్ ఉమన్ అనాలో తేలియడం లేదు. మీ ఉదారతను పొగడటానికి మాటలు సరిపోవడం లేదు నా గుండె మీ కోసమే కొట్టుకుంటోంది లవ్ యూ మేడమ్. అంటూ ట్వీట్ల ద్వారా సుష్మాను పొగడ్తల్లో ముంచెత్తింది.













