పాక్ ప్రధాని యూఎస్‌కు?
పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖాన్ అబ్బాసీ ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సమావేశాల్లో పాల్గొంటారని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధానిగా తొలిసారి న్యూయార్క్ వెళ్లనున్నా ఆయన, అక్కడ ప్రపంచ దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశామవుతారని ఆదేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. సమితి నుద్దేశించి పాక్ ప్రధాని చేసే ప్రసంగంలో కశ్మీర్‌తో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తారని తెలుస్తోంది.








