ఏకాభిప్రాయం కాదు…ఏకపక్షం: నిప్పులు చెరిగిన కాంగ్రెస్
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం పేరుతో బీజేపీ అనుసరించి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరును బీజేపీ సోమవారం ప్రకటించడంపై కాంగ్రెస్ స్పందించింది. ఏకపక్ష పోకడలకు బీజేపీ పాల్పడిందని నిప్పులు చెరిగింది. ఏకాభిప్రాయసాధన పేరుతో బీజేపీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు సోనియాగాంధీని కలిసినప్పటికీ ఎన్డీయే అనుకుంటున్న అభ్యర్థి పేరును వెల్లడించలేదని, పేరు చెప్పకుండా డ్రామా ఆడారని విమర్శించింది. ఇప్పుడు ఏకపక్ష నిర్ణయం తీసుకుని, పేరు ప్రకటించేశారని పేర్కొంది. అది ఏకాభిప్రాయ సాధన ఎలా అవుతుందని ప్రశ్నించింది. ప్రతిపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థిని నిలపే విషయంలో సమష్టి నిర్ణయం తీసుకుంటాయని కాంగ్రెస్ తేల్చిచెప్పింది.








