ఓలా ప్లే లో లైవ్ టీవీ కోసం యప్ టీవీ తో జతకట్టిన ఓలా
20కి పైగా వార్తా చానెళ్ళ తో పాటు, ఇతర చానెళ్ళు ను కూడా ప్రయాణంలో లైవ్ గా వీక్షించ వచ్చు!
సౌత్ ఇండియన్ కంటెంట్ ను అందించే ప్రపంచపు అతి పెద్ద ఓవర్ ది టాప్ (ఓటిటి) ప్లేయర్ అయిన యప్ టీవీ తాజాగా నేడు భారతదేశపు ప్రముఖ మొబైల్ ఆధారిత రవాణా యాప్ అయిన ఓలా యోక్క రైడ్ షేరింగ్ కనెక్టెడ్ కార్ ప్లాట్ఫారం అయిన ఓలా ప్లే కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. ఓలా ప్రయాణికులు ఇపుడు లైవ్ టీవీ వీక్షించి యప్ టీవీ జాబితా కు చెందిన న్యూస్, మ్యూజిక్ మరియు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లను ఓలా ప్లే ద్వార వీక్షించ వచ్చు, ఈ ఒక భాగస్వామ్యం ద్వార ప్రయాణికులకు ఒక నిరంతర విశ్రాంత గదిలో కలిగే అనుబవాన్ని కారులో అందిస్తుంది. ఇందులో లబించే కంటెంట్ కూడా ప్రయాణికుల అవసరాన్ని బట్టి ఉంటుంది, అది రైడ్ ఇన్ఫర్మేషన్ తో పాటు టైం, గమ్యస్థానం మరియు కారు అనుభవంలో సంపూర్ణంగా కనెక్ట్ చేయటానికి కావలసిన భాష కూడా ఎంపిక చేసుకోవచ్చు.
యప్ టీవీ ద్వారా ప్రసారకర్తలు మరియు కంటెంట్ ప్రొవైడర్స్ వారి మాధ్యమ ప్రేక్షకులను పలు మాధ్యమాలు మరియు తెరల ద్వారా చేరుకోవడానికి అనుమతిస్తుంది మరియు యప్ టీవీ యొక్క విస్తృతమైన లైవ్-స్ట్రీమింగ్ కంటెంట్‌తో అనేక ఓలా వినియోగదారులకు అనుభవాన్ని మెరుగుపర్చగల సామర్థ్యం ఉంది. అంతే కాకుండా, ఓలా రెంటల్ మరియు ఓలా అవుట్ స్టేషన్ ని ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉన్నతమైన అనుభవం ప్రతిపాదనకు విలువను జతచేస్తుంది. లాంగ్, ట్రాఫిక్ తో కూడిన ప్రయాణాలు ఇప్పుడు యప్ టీవీ యొక్క విస్తృత ఎంపిక డిస్ప్లేలో వినోద ఎంపికలతో సులభంగా ప్రయాణిం చేయవచ్చు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ….ఉదయ్ రెడ్డి, ఫౌండర్ మరియు సీఈఓ, యప్ టీవీ….” ఓలా ప్లేకి ప్రత్యక్ష ప్రసార టీవీ ఛానళ్లను తీసుకురావటానికి ఓలాతో మా అనుబంధాన్ని ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. యప్ టీవీ లో మెము ఎల్లపుడు మా వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండే వినోదాత్మక కంటెంట్‌ను చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఓలా యొక్క ఏకైక కనెక్ట్ కారు అనుభవాన్ని అందిచే, ఓలా ప్లే ద్వార ఓలా క్యాబ్ రైడర్స్ యొక్క ఏకైక అభిరుచులకు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దేశించబడిన ఒక లీనమైన వినోద అనుభవం కోసం ఓలా కృషి చేస్తుంది. యప్ టీవీ యూజర్ బేస్ లో వృద్ధి తో పాటు అదనంగా,ఈ బాగస్వామ్యం ఇప్పుడు ఓలా క్యాబ్ వినియోగదారుల ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా మరియు వినోదభరితంగా చేస్తుంది.” అని అన్నారు.
ఈ తాజా అభివృద్ధి గురించి మాట్లాడుతూ…అంకిత్ జైన్, వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ అఫ్ ఓలా ప్లే….”ఓలా ప్లే రైడ్ షేరింగ్ అనుభవాన్ని మార్చడానికి ఏర్పాటు చేయబడిన ఒక పరిశ్రమ-తొలి ఆవిష్కరణ. పర్యావరణ వ్యవస్థతో పాటుగా మరియు వినూత్న OTT ప్లాట్ ఫారం అయిన యప్ టీవీతో భాగస్వామ్యం మా యొక్క కస్టమర్ల కోసం అనూహ్యమైన మరియు సంబంధిత అనుభవాలను కొనసాగించడానికి మా ప్రయత్నాల్లో భారీ పాత్రను పోషిస్తుంది. ఈ భాగస్వామితో, ఓలా ప్లే మొదటిసారి ఒక క్యాబ్‌లో లైవ్ TV ను తెస్తుంది, యూజర్ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా లేదా వెనుక సీట్ లో ఉన్న ట్యాబ్ ద్వార యాక్సెస్ చేయగల అనుభవాన్ని తీసుకురావడానికి యప్ టీవీ యొక్క OTT సేవలు ఎంతో సులభంగా ఉంటాయి. అంతే కాకుండా.. ఈ భాగస్వామ్యంతో, ప్రయాణంలో అందుబాటులో ఉండే LIVE న్యూస్ చానెల్స్ తో పాటు,విశ్రుత శ్రేణి టీవీ ఛానల్స్ యొక్క పరిధిని మేము ఓలా ప్లే లోకి తీసుకువస్తున్నాము తద్వారా ఓలా వినియోగదారుల ప్రయాణ సమయాన్ని మరింత ఉత్పాదకరంగా చేస్తుంది.” అని అన్నారు.
ప్రస్తుతం ఓలా ప్లే దేశం లోని 6 ప్రధాన నగరాలు అయిన ముంబై, ఢిల్లీ,బెంగుళూరు, చెన్నై, పూణే మరియు హైదరాబాద్ లో అందుబాటు లో ఉన్నది.
ఓలా కు చెందిన యాజమాన్య కారులో మరియు ఓలా ఆధారిత క్లౌడ్ టెక్నాలజీస్ ద్వారా, ఓలా ప్లే అధునాతన కారు నియంత్రణలు, వ్యక్తిగతీకరించిన కంటెంట్ యొక్క ఎంపిక మరియు యాపిల్ మ్యూజిక్, AIB, TVF, ఆడియో కంపాస్, ఎరోస్, అరే, లట్టు కిడ్స్ మరియు పాప్ XO యొక్క అధిక నాణ్యత పరస్పర అనుభవాన్ని నిర్మించడానికి భాగస్వామ్యాలు ద్వారా పూర్తిస్థాయిలో కనెక్ట్ అయిన ఇంటరాక్టివ్ అనుభవాన్ని వినియోగదారుల కోసం అందిస్తుంది.
యప్ టీవీ గురించి..:
యప్ టీవీ ప్రపంచపు అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత టీవీ మరియు దక్షిణ ఆసియా కంటెంట్‌ను ఆన్-డిమాండ్ సేవలతో అందించే ఆన్లైన్ టీవీ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని అట్లాంటాలో ఉండగా, అమెరికా, ఇండియాలో బ్రాంచి ఆఫీసులున్నాయి. రెండు ఛానెళ్లతో ప్రారంభమైన యప్ టీవీ ప్రస్థానం ఇప్పుడు 250కి పైబడి ఛానెళ్లకు, 5వేల సినిమాలు, 100కు పైబడి టీవీ షోలను 14 భాషలో్ల అందించే స్థాయికి చేరుకుంది. ప్యాన్ ఏసియన్ వేధిక అయినటువంటి ప్రపంచ పెట్టుబడుల సంస్థ కెకెఆర్ విభాగం ఎమరాల్డ్ మీడియా ఇటీవలే యప్టీవీలో 50 యూఎస్ మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. దీనికి ముందు సీరీస్-ఏలో భాగంగా పోర్చ్ క్రీక్ ఇండియన్ ట్రైబ్ ఆఫ్ అలబామ సైతం యప్టీవీలో పెట్టుబడి పెట్టింది.
యప్టీవీలో 25వేల గంటల నిడివిగల కంటెంట్ ఉంది. అందులో రోజూ 2,500ల గంటల వరకు నిడివి కలిగిన సరికొత్త ఆన్‌డిమాండ్ వీడియోలు చేరుతుంటాయి. అలాగే యప్ టీవీ లైవ్‌టీవీ మరియు క్యాచ్ అప్ టీవీ సాంకేతికతను ఆఫర్ చేస్తుంది. సుమారు 50కిపైగా దేశాలో్ల వినియోగంలో ఉంది. తాజాగా ఆన్ డిమాండ్ పై సినిమాలను చూసుకునేందుకు ఉపయొఓగపడే యప్ ఫ్లిక్స్, మరియు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అయినటువంటి యప్ టీవీ బజార్ ను ప్రవేశపెట్టింది. సినిమా పరిశ్రమ నుండి ఉన్నతాధికారులతో సహకారంతో చెప్పే అసాధారణ కథను ముందుకు తీసుకొచ్చేందుకు యప్ టీవీ ఒరిజినల్స్. ఒరిజినల్ డిజిటల్ ప్రేక్షకులకు ఎపిసోడిక్ ఫార్మాట్లో యప్ టీవీ వేదిక పైన ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. విదేశాల్లో నివసిస్తోన్న దక్షిణాసియా వాసుల విషయంలో యప్‌టీవీ నెంబర్ వన్ ఇంటర్నెట్ పే టీవీ. అలాగే దక్షిణాసియాలో అతిపెద్ద ఇంటర్నెట్ టీవీగా పేరుగాంచింది. 13 మిలియన్ల మొబైల్ డౌన్‌లోడ్స్‌తో 4.0 రేటింగ్‌తో అత్యంత డౌన్ లోడెడ్ ఇండియన్ స్మార్ట్ టీవీ యాప్‌గా కొనసాగుతుంది.
Visit www.yupptv.in for more information.
ఓలా గురించి:
ఐఐటి బొంబాయి అలుమ్ని కి చెందిన భవిష్ అగ్గార్వాల్ మరియు అంకిత్ భాటి చే జనవరి 2011 లో స్థాపించ బడిన ఓలా(ఇదివరకు ఓలాక్యాబ్స్) వ్యక్తిగత రవాణా కోసం భారతదేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ అనువర్తనం (యాప్). అనుకూలమైన, పారదర్శక మరియు త్వరిత సేవ సంపూర్ణతకు భరోసా కల్పించే ఒక మొబైల్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంలో వినియోగదారులకు మరియు డ్రైవర్ భాగస్వాములకు ఓలా నగరం రవాణాను అనుసంధానిస్తుంది. ఒక బిలియన్ ప్రజల కోసం చైతన్యాన్ని కట్టే లక్ష్యంతో ఓలా కట్టుబడిగా పని చేస్తుంది. ఓలా మొబైల్ యాప్ ఉపయోగించి, 6,00,000 వాహనాలు అయిన క్యాబ్‌లు, ఆటో రిక్షాలు మరియు టాక్సీలు 110 నగరాల్లోని వినియోగదారులు బుక్ చేసుకోవచ్చు. ఓలా షటిల్ మరియు ఓలా షేర్ వంటి రైడ్-భాగస్వామ్యానికి వరుసగా ఓవర్ షేర్డ్ మొబిలిటీ సర్వీసులను ఓలా వేదికపై ప్రయాణీకులకు ప్రవేశపెట్టింది. ఓలా యాప్ విండోస్, ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వేదికల పైన అందుబాటులో ఉన్నది. Please visit www.olacabs.com/media for more information.
ఓలా ప్లే గురించి:
నవంబర్ 2016లో ప్రారంబించబడిన ఓలా ప్లే, ప్రపంచం యొక్క మొట్టమొదటి కార్ల ప్లాట్‌ఫాం ముందుకొచ్చిన కారు నియంత్రణలు, వ్యక్తిగతీకరించిన కంటెంట్ ఎంపిక మరియు క్యాబ్ వెనుకవైపుకు పూర్తిగా కనెక్ట్ అయిన ఇంటరాక్టివ్ అనుభవాన్ని తీసుకురావడం ద్వారా పదుల వేల మంది భారతీయ వినియోగదారులకు ఇన్-క్యాబ్ అనుభవాన్ని రూపాంతరం చేసింది. ఆపిల్ మ్యూజిక్, సోనీ LIV, AIB, TVF, ఆడియో కంపాస్, ఎరోస్, అరే మరియు ఫైండ్, ALT బాలాజీ, పాప్ xo తో సహా అధిక నాణ్యత ఇంటరాక్టివ్ అనుభవాలు, ఓలా ప్రైమ్ ప్లే కమ్యూటర్ కోసం ఇప్పుడు ఒక రియాలిటీ.













