ఐటీ శాఖ సంచలనం: కమిషనర్లకు షాక్
ఆదాయపు పన్నుశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ విభాగంలో ఉన్నత అధికారుల బదిలీలతో భారీగా సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ‘పనితీరు’ మెరుగుగా లేని కమిషనర్లకు షాకిచ్చింది. ముఖ్యంగా పనితీరును పరిగణనలోకి తీసుకున్న సంస్థ దేశవ్యాప్తంగా ముఖ్యమైన స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఆదాయం పన్ను కమిషనర్లకు సంబంధించిన ఇది అతిపెద్ద మార్పుగా భావిస్తున్నారు.
డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డ్ , (సీబీడీటీ) లో దేశవ్యాప్తంగా 245 కమిషనర్లను కీలక స్థానాలనుంచి బదిలీ చేసిందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. సీబీడీటీలో నాన్-పెర్ఫామెన్స్ అధికారులతోపాటు, విజిలెన్స్ లేదా ఇతర క్రమశిక్షణా ఆరోపణలను ఎదుర్కొంటున్నవారిని, పదవిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న అధికారులకు స్థానభ్రంశం కల్పించింది.
సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ ఐటి కార్యాలయాలకు రాసిన ఒక లేఖలో, ఈ సంవత్సరం తమ పన్ను పరిధిని గణనీయంగా విస్తరించడానికి, వారి అధికార పరిధిలోని ప్రాంతానికి సంబంధించి స్పెషల్ ప్రొఫైల్‌కు అనుగుణంగా” ప్రాంతీయ వ్యూహాన్ని “అభివృద్ధి చేయాలని కోరారు.








