సీతారాం ఏచూరికి ఈసారి అవకాశం లేదు
సీనియర్ నేత, పార్టీ ప్రధాన క్యాదర్శి సీతారాం ఏచూరిని వరుసగా మూడోసారి రాజ్యసభకు నామినేట్ చేసే ప్రతిపాదనను సీపీఎం కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఈ మేరకు 3 రోజుల పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చింది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూన్న ఏచూరి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ స్థానానికి ఆగస్టు 8న జరగనున్న ఎన్నికకు 28తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.








