రామమందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు..
అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని భాజపా ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ముస్లిం కమ్యూనిటీ సైతం అండగా నిలిచిందని ఆయన తెలిపారు. మంగళవారం బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ నిమిత్తం లఖ్నవూ చేరుకున్న భాజపా అగ్రనేతలను కలిసేందుకు ఎంపీ సాక్షి మహరాజ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.








