సెలవుల్లేవు…
ఈనెల 25 నుంచి ఏప్రిల్ 1 వరకూ అన్ని రోజులూ బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా అన్ని ఏజెన్సీ బ్యాంకులకు కీలక ఆదేశాలిచ్చింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లు, ప్రభుత్వ రసీదులు, చెల్లింపు విధులను సులభతరం చేసేందుకు అన్ని ఏజెన్సీలు బ్యాంకులు తమ బ్యాంకుబ్రాంచ్లను ఈనెల 25-ఏప్రిల్ 1 వ తేదీ మధ్య (శని, ఆదివారం, సెలవు దినాలతో సహా) తెరిచి ఉంచాలని కోరుతున్నామని ఆర్బీఐ నోటిఫికేషన్లో తెలిపింది.







