విమాన ప్రయాణంపై కేంద్రం సంచలన ఉత్తర్వులు
విమానయానంతో పాటు నో ఫ్లై జాబితా విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమానయాన భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏదైనా విమానంలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐడీ కార్డును తప్పనిసరి అని కేంద్ర తేల్చి చెప్పింది. దేశీయ యానానికి సైతం ఆధార్ కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్సు, లేదా పాస్ పోర్టు, లేదా పాన్ కార్డు , ఓటరు ఐటీ కార్డులలో ఎదైనా ఒకటి తప్పనిసరిగా చూపించాలని కేంద్రం వెల్లడించింది. విదేశీ ప్రయాణాలకు పాస్ పోర్టు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ఇటీవల మంగోలియాలో జరిగి విమానయానంలో భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన నేపథ్యంలో నో ప్లే జాబితాపై నిబంధనలు రూపొందించినట్లు కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు. నో ఫ్లై జాబితాలో ఉన్న వ్యక్తులు మారుపేర్లతో ప్రయాణం చేయకుండా ఆపేందుకు వీలుగా త్వరలో డిజిటల్ బోర్డింగ్ కార్డులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.








