యమునా గట్లపై చెత్తను తొలగించండి
యమునా నది గట్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాలను మూడు వారాల్లోగా తొలగించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. విచక్షణారహితంగా చెత్త పడేయడమే ఈ నది కలుషితం కావడానికి ప్రధాన కారణమని కూడా ట్రిబ్యునల్ పేర్కొంది, ఈ ఆదేశాలను అమలుచేసే బాధ్యత ఢిల్లీ, యుపి నీటిపారుదల శాఖలదేనని కూడా ఎన్జిటి చైర్పర్సన్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం స్పష్టం చేసింది.








