త్వరలో రూ.200 నోటు
దేశవ్యాప్తంగా రూ.200 నోటును రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చెలామణిలోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన అంశంపై జరిగిన కీలక చర్చల్లో పాల్గొన్న ఓ ఉన్నతాధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే వీటిని ప్రింటింగ్‌కు కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఈ నోట్లను తీసుకొచ్చే అవశ్వకతపై ఆర్థికమంత్రిత్వ శాఖతో మార్చిలోనే సంప్రదింపులు జరిగాయట. దీనిపై త్వరలోనే ఆర్బీఐ నోటిఫికేషన్ జారీచేయనుంది. దేశంలో చిల్లర సమస్యలు తల్తెతకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు రూ.200 నోట్లను చెలామణిలోకి తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.








