త్వరలో కొత్త రూపాయి నోట్లు
కొత్త ఒక రూపాయి నోట్లు త్వరలో రానున్నాయి. ప్రధానంగా గులాబి- ఆకుపచ్చ, అలాగే ఇతర రంగుల కలయికతో ఒక రూపాయి నోట్లను చలామణిలోకి తేనున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. భారత ప్రభుత్వంతో కూడిన రూపాయి చిహ్నం ఈ నోట్లపై కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక రూపాయి నాణేలు ముద్రిస్తున్నారు. 1994లో ఒక రూపాయి నోట్ల ముద్రను ఆపేసినప్పటికీ 2015లో మళ్లీ ప్రారంభించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్త రూపాయి నోట్లను చలామణిలోకి తీసుకురానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ నోట్ల ముద్రణను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్బిఐ వెల్లడించింది.








