చలామణీలోకి రూ.200నోటు
శుక్రవారం నుంచి కొత్త రూ.200 నోటు చలామణీలోకి రానున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. నవంబరు 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత విడుదల కానున్న మూడో నోటు ఇది. కొత్తగా విడుదల కానున్న ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగాన భారతదేశ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు. ఈ నోటు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.








