జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది .. గవర్నర్ను కలిసిన మేఘన
మా అత్తమామలు, జోగి రమేష్(Jogi Ramesh), శకుంతల, నా భర్త రాజీవ్ ( Rajiv) ఇతర కుటుంబసభ్యుల నుంచి నాకు, నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది. మాకు రక్షణ కల్పించండి. నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోండి అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్ కోడలు మేఘన( Meghana) గవర్నర్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer)ను కోరారు. తన తండ్రి అనంతకృష్ణగౌడ్ (Ananthakrishna Goud)తో కలిసి గవర్నర్ను రాజ్భవన్లో కలిసి వినతిపత్రం అందించారు. నా తల్లిదండ్రులు నా పెళ్లికి రూ.5 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత కొన్నాళ్లకే అత్తమామలు రూ.5 కోట్ల అదనపు కట్నం, ఖరీదైన కార్లు, వజ్రాల నక్లెస్ , వజ్రపు ఉంగరం తీసుకురావాలని వేధింపులు మొదలు పెట్టారు. గోవాకు వెళ్లినప్పుడు నాకు ఈత రాదని తెలిసినా నా భర్త పడవ పై నుంచి నీటిలోకి నెట్టేయడానికి ప్రయత్నించారు అని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. కేసును తెలంగాణకు మార్పించుకోవాలని మేఘనకు సూచించారు.








