Kondapalli Srinivas: సెల్యూట్ టూ మై సీఎం, అంటున్న కొండపల్లి..!
ఏపీ సచివాలయంలో(Ap secretariat) రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ ల కాన్ఫరెన్స్ పై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన అనుభవాన్ని పంచుకున్నారు. స్పష్టమైన విజన్, అనుభవం ఉన్న నాయకుడితో కలిసి పని చేయడం ఆ దేవుడు ఇచ్చిన వరం అంటూ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసారు. “బుధవారం ఉదయం 10 గంటలకు మొదలైన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు నేను ఒక కేబినేట్ మంత్రిగా హాజరైనా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) గారి ముందు ఓ విద్యార్ధిలా మారిపోయాను.
అన్ని శాఖల పని తీరుపై ఆయన అనర్గళంగా మాట్లాడటం ఒక ఎత్తు అయితే, అధికారులను సబ్జెక్ట్ పరంగా సీఎం గారు అడుగుతోన్న ప్రశ్నలు విని ఆశ్చర్యపోయిన సందర్భాలు కోకొల్లలు. బెస్ట్ ప్రాక్టీసెస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వారు ఇచ్చిన ఓ బృహత్తర కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. నిన్న ఏం జరిగింది, నేడు ఏం చేస్తున్నాము, రేపు ఏం చేయాలనేది వారిలో ఉన్న విజన్ ఎంతో ఆశ్చర్యపరిచింది.
ఇవి కూడా చదవండి
ఒక 76 ఏళ్ళ మనిషి, అలుపు, విసుగు అనే పదాలకు తావు లేకుండా, నిర్విరామంగా అలా, గంటల తరబడి.. బుధవారం 11 గంటలు, గురువారం 12 గంటల పాటు సమీక్షలు నిర్వహిస్తుంటే, నా లాంటి యువకులు, అనుభవజ్ఞులైన అధికారులు, మంత్రులు, ఎందరో వారి నిబద్దత చూసి ఆశ్చర్యపోవడం మా వంతు అయింది. మంత్రులు, అధికారులు చేస్తున్న మంచి చెడులను ఓపికగా కూర్చుని ఆయన అడిగి తెలుసుకోవడం, సున్నితంగా హెచ్చరికలు చేయడం, కొన్ని సందర్భాల్లో కాస్త కఠినంగా హెచ్చరించడం నాకు మంచి అనుభవాలను ఇచ్చింది. కేవలం ప్రభుత్వ పరంగానే కాదు మా జీవితాలకు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఇవి. సెల్యూట్ టూ మై సీఎం” అంటూ పోస్ట్ చేసారు.
ఇవి కూడా చదవండి








