సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యల కేసు.. వైసీపీ నేత నాగార్జునకు రిమాండ్
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ (Nagarjuna Yadav)కు నాంపల్లి కోర్టు (Nampally Court) 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను బేగంబజార్ పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్లో నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది కైలాశ్ సజ్జన్ (Kailash Sajjan) చేసిన ఫిర్యాదు మేరకు ఈ నెల 10న బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆదివారం గుంటూరులోని నాగార్జున నివాసానికి పోలీసులు వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు.








