సీఎం రేవంత్‌ను కలిసిన ఎస్సీ కమిషన్ చైర్పర్సన్
ప్రజా భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్ కిషోర్ మక్వానా భేటీ.
రాష్ట్రంలో విద్యార్థుల మధ్య
కుల వివక్షను దూరం చేసేందుకు కీలక చర్యలు చేపట్టాం.
ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేశాం.
విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కూల్ లోనే అందిస్తున్నాం.
విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.
కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న ప్రాంతంలో మొదటగా వీలైనన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సంఖ్యను పెంచుతున్నాం.
రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నాం.
రాజకీయాల్లో, ఇతర రంగాల్లో కీలక స్థానాల్లో ఎస్సీలకు అవకాశాలు కల్పించాం.
ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నాం.
ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలి.
హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు.








