ఈ నష్టం ప్రతిపక్ష పార్టీల వల్ల జరిగింది : లోకేశ్
పునర్విభజన, రాజ్యాంగ సరవణ బిల్లులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు (Opposition parties) దక్షిణ భారతదేశం (South India,), ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల (small states)కు అన్యాయం చేశాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఆర్టికల్ 81 ప్రకారం రాష్ట్రాల మధ్య స్థానాల పంపిణీ ఫ్రీజ్ లో ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ బిల్లులు లేకపోతే, 2026 జనగణన తర్వాత జనాభా ఆధారంగా మాత్రమే స్థానాలు నిర్ణయిస్తారు. దీంతో మంచి పనితీరు చూపిన రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. ఇది ఫెడరల్ సమతుల్యతపై నేరుగా దాడి చేసినట్లే నన్నారు. ఈ నష్టం ప్రతిపక్ష పార్టీల వల్ల జరిగిందని విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








