సీనియర్ ఐఏఎస్ కే.కన్నబాబు కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్
హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి కే.కన్నబాబు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని ఈవెంతారా కన్వెన్షన్ లో జరిగిన వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులు రితేష్ సూర్య ప్రీతమ్, హిమ ఐశ్వర్యలను ఆశీర్వదించారు. పుష్పగుచ్ఛం అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.








