హైదరాబాద్‌కు ఐమ్యాక్స్ థియేటర్.. డిసెంబర్ 18 నుంచి సందడి!
హైదరాబాద్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐమ్యాక్స్(Imax) థియేటర్ అందుబాటులోకి రాబోతోంది. ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే పలు ఐమ్యాక్స్ స్క్రీన్లు ప్రేక్షకులను అలరిస్తుండగా, హైదరాబాద్‌లోనూ అలాంటి ప్రీమియం సినిమా ఎక్స్‌పీరియెన్స్ కోసం చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఈ నిరీక్షణకు తెరదించుతూ ఏఎంబీ విక్టరీ ఐమ్యాక్స్ ముస్తాబవుతోంది. డిసెంబర్లో ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 18 నుంచి హాలీవుడ్ మూవీ డ్యూన్3(DUne3)తో ఆడియన్స్ కు ఐమ్యాక్స్ అనుభూతిని పరిచయం చేయనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఏషియన్ సినిమాస్, విక్టరీ వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు(mahesh babu) భాగస్వామ్యంతో ఈ ప్రీమియం మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఒక ఐమ్యాక్స్ స్క్రీన్‌తో పాటు 4డీఎక్స్ స్క్రీన్, మరో ఐదు రెగ్యులర్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత, మెరుగైన సౌండ్ సిస్టమ్, స్పెషల్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ తో ఆడియన్స్ కు సరికొత్త సినిమా ఎక్స్పీరియన్స్ అందించడమే టార్గెట్ గా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
మరోవైపు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినీ ఫ్యాన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థానంలో ఈ కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. ఒకప్పుడు భారీ సినిమాల రిలీజ్‌లకు కేరాఫ్‌గా నిలిచిన ఈ థియేటర్ స్థానంలో ఏడు స్క్రీన్లతో కొత్త సినిమా కేంద్రం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ సినీ ప్రదర్శన రంగంలో ఈ మల్టీప్లెక్స్ కీలక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.







