డబుల్ హ్యాట్రిక్‌పై దుల్కర్ కన్ను!
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salman)కు తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఆయన నటించిన మహానటి(mahanati), సీతారామం(Sitaramam), లక్కీ భాస్కర్(Lucky bhaskar) సినిమాలు తెలుగులో గ్రాండ్ సక్సెస్‌లను అందుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా కథకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలను ఎంపిక చేసుకునే దుల్కర్‌కు టాలీవుడ్లో మాత్రం వరుస సక్సెస్‌లు దక్కుతున్నాయి. ఇప్పుడు ఈ సక్సెస్ పరంపరను కంటిన్యూ చేసేందుకు ఆకాశంలో ఒక తార(Aakasam lo oka taara) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. నవంబర్ 20న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఇవి కూడా చదవండి
ఎమోషన్స్ తో కూడిన కథలో దుల్కర్ సల్మాన్ మరోసారి తన యాక్టింగ్ తో మెప్పించబోతున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఈ తరహా కథకు ఆయన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టీమ్ కూడా సినిమా సక్సెస్‌పై ఎంతో నమ్మకంతో ఉంది. గీతా ఆర్ట్స్(Geetha arts), స్వప్న సినిమా(swapna cinema) వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి ఈ సినిమాను రూపొందించడం మరో విశేషం. కంటెంట్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రెండు సంస్థలు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.
పవన్ సాదినేని(pavan sadhineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సందీప్ గున్నం(Sandeep gunnam) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి(Satvika veeravalli) ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుండగా, శృతి హాసన్(Shruti hasan) కీలక పాత్రలో కనిపించనుంది. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) మ్యూజిక్ ను అందిస్తున్న ఈ సినిమా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కి దుల్కర్ ఖాతాలో మరో విజయాన్ని చేరుస్తుందా? తెలుగులో ఆయన సక్సెస్ హ్యాట్రిక్‌ను కంటిన్యూ చేసి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారా? అన్నది తెలియాలంటే నవంబర్ 20 వరకు వేచి చూడాల్సిందే.







