MP Putta : నేను ఏ తప్పూ చేయలేదు : ఎంపీ పుట్టా మహేశ్
మెయినాబాద్ డ్రగ్స్ (Drugs) ఘటనలో తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ (Putta Mahesh Kumar)వివరణ ఇచ్చాను. తాను ఎలాంటి వ్యక్తినో ఏలూరు (Eluru) ప్రజలు, పార్టీ నేతలకు తెలుసన్నారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని, ఏ తప్పూ చేయలేదని తెలిపారు. స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్ ఫామ్ హౌస్ (Moinabad Farmhouse) కు వెళ్లా. ఆ సమయంలో మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆరోపణలను ఎవరూ నమ్మొద్దు. పోలీసు విచారణకు సహకరిస్తా. పూర్తి వివరాలతో త్వరలో ప్రజలకు ముందుకు వస్తా అని పుట్టా మహేశ్ అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








