నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలకు.. సీఎం చంద్రబాబు అభినందనలు
ప్రతిష్ఠాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్న విజేతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అభినందించారు. అవార్డులు ( Awards) సాధించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ సాధించిన అద్భుత విజయాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు (Directors), నిర్మాతలు (Producers) మరియు సాంకేతిక నిపుణుల అసమాన ప్రతిభే తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో గర్వించేలా చేసిందని చంద్రబాబు కొనియాడారు. చలనచిత్ర రంగం, కళలు, సంస్కృతి అనేవి మన సమాజ వారసత్వానికి, అస్తిత్వానికి బలమైన పునాదులని ఆయన అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ ( Tollywood) రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.








