రాహుల్‌ను కలవడం నా అదృష్టం
స్పెయిన్, ఆస్ట్రేలియా నటీమణి నతాలియా రామోస్ తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసిన పోటో ఇది. ఇటీవల అమెరికా వచ్చిన గాంధీవంశానికి చెందిన వారసుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడం తన అదృష్టమని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. రాహుల్ వాగ్ధాటి, అంతర్దృష్టి తనకెంతో నచ్చాయని పేర్కొంది. దీనిపై అనేకమంది ఆన్లైన్ వేదికగా ఛలోక్తులు విసురుతున్నారు. ఆయన భవిష్యత్తు ప్రధాని అని ఒకరు, ఆయన జేబులు ఖాళీ డబ్బులేవీ లేవని మరొకరు కామెంట్లు పెట్టారు.








